సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:01 IST)

భార్య అశ్లీల ఫోటోలు తీసి తమ్ముడుకి పంపిన భర్త

అబుదాబీలో ఓ భర్త కట్టుకున్న భార్య పరువు తీశాడు. తన భార్య అశ్లీల ఫోటోలను తీసి చివరకు తన తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులకు పంపించాడు. ఈ నేరానికి ఆయనకు స్థానిక కోర్టు రూ.50 లక్షల వరకు అపరాధం విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆసియా జాతీయుడైన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి అబుదాబిలో నివశిస్తున్నాడు. ఈయన తన భార్య అశ్లీల ఫోటోలను తీసి తమ్ముడుతో పాటు కుటుంబ సభ్యులకు తన ఫోను ద్వారా పంపించాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే, అతని మొబైల్ ఫోను నుంచి పంపించాడా? అని నిర్ధారించేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఫోను పంపగా, అతని ఫోను నుంచే వెళ్లినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ దేశ చట్టాల మేరకు అతనికి 50 లక్షల రూపాయలు (25 దిర్హాన్‌) అపరాధం విధించారు.