సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (08:35 IST)

మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు మనం ఏకాకులమే : పాకిస్థాన్

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భా

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయనే ఆశ తమకు లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ భారత్ 'ఆధిపత్య ధోరణి' ప్రదర్శిస్తోందంటూ విమర్శల దాడి చేశారు. ఆసియా ప్రాంతంలో భారత్ ఆధిపత్య ధోరణిని పాకిస్థాన్ విభేదిస్తోందని, సమాన ప్రాతిపదికనే ద్వైపాక్షిక సంబంధాలు ఉండితీరాలని ఆయన పేర్కొన్నారు. 'మోడీ ప్రధానిగా ఉండగా భారత్‌తో సంబంధాల్లో పురోగతి ఉంటుందనే ఆశ మాకు (పాక్) లేదు' అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు అసోసియేట్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ (ఏపీపీ) తెలిపింది.