శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 జులై 2018 (11:59 IST)

ఇండోనేషియా భూప్రకంపనలు : పది మంది మృతి

ఇండోనేషియాలో భూకంపం ఏర్పడింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం లోమ్‌బాక్ దీవిలో సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం భయంతో

ఇండోనేషియాలో భూకంపం ఏర్పడింది. ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయ్యాయి. ఆదివారం ఉదయం లోమ్‌బాక్ దీవిలో సంభవించిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలాయి. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం భయంతో ఇళ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు.
 
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదుగురు వ్యక్తులు చనిపోగా… 24 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.47 గంటలకు భూకంపం సంభవించింది. 

భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.