శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (13:20 IST)

రుణ ఒత్తిళ్ళతో ఆరుగురు ఆత్మహత్య హత్య...

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంచలనం మరిచిపోకముందే జార్ఖండ్ రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చె

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంచలనం మరిచిపోకముందే జార్ఖండ్ రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఇంట్లోనే ఉరివేసుకుని విగతజీవులై కనిపించడం సంచలనమైంది. మృతులలో ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైట్ నోట్‌‌ను బట్టి ఆ కుటుంబం తీవ్రమైన రుణ ఒత్తిళ్లకు లోనైనట్టు తెలుస్తోంది.
 
మర్వాడి కుటుంబానికి చెందిన ఆరుగురు మృతుల్లో ఐదుగురు ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడగా, ఆరోవ్యక్తి ఇంటి పైకప్పు నుంచి దూకి మరణించినట్టుగా తెలుస్తోంది. మృతులను మహావీర్ మహేశ్వరి (70), ఆయన భార్య కిరణ్ మహేశ్వరి (65), వారి కుమారుడు నరేష్ అగర్వాల్ (40), అతని భార్య ప్రీతి అగర్వాల్ (38), ఆ ఇద్దరి కుమారులు అమన్ (8), అంజలి (6)గా గుర్తించారు. 
 
అగర్వాల్స్ కుటుంబానికి సొంతంగా డ్రై ఫ్రూట్స్ దుకాణం ఉందని, చాలా అప్పుల్లో కూరుకుపోయారని చెబుతున్నారు. కుటుంబ కలహాలు కూడా దీనికి తోడయినట్టు తెలుస్తోంది. మార్వాడీ కుటుంబీకులు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.