శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 జులై 2018 (09:56 IST)

'వట వృక్ష' పేరుతో వారంతా మోక్షం కోసం చనిపోయారు...

దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ

దేశరాజధాని ఢిల్లీనేకాకుండా దేశం యావత్తునూ ఉలిక్కిపడేలా చేసిన ఘటన బురారీ సామూహిక ఆత్మహత్యల ఘటన. ఈ ఘటనలో 11 మంది సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు. మోక్షం కోసం "వట వృక్ష" పేరుతో వీరు ఈ బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే, ఈ 11 మంది ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి హస్తమున్నట్టు తెలుస్తోంది. 
 
వీరంతా ఆత్మహత్యలకు ముందు ప్రత్యేక పూజలు చేసి.. ఇంటి ప్రధాన ద్వారం తెరిచిపెట్టారు. ఆ తర్వాత బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా చేయడానికికారణం ఇంటి ద్వారం నుంచి అతీంద్రియ శక్తి ప్రవేశిస్తుందనే నమ్మకం. అదేసమంయలో ఈ ఆత్మహత్యల వెనుక 12వ వ్యక్తి ప్రమేయం ఉండటం. 
 
పైగా, ఆత్మహత్య చేసుకున్నవారంతా.. కళ్లు, ముక్కు, నోరూ మూసుకుని, చేతులను వెనక్కి కట్టేసుకోవడం. ఇంతటిదారుణానికి పాల్పడింది నారాయణ్‌ దేవితోపాటు ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్నారు. ఈ ఘటన ఈనెల ఒకటో తేదీన తమ నివాసంలోనే జరిగింది.