బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 22 జూన్ 2018 (23:02 IST)

అలాంటివాడు మల్లెపువ్వులా ఎలాంటి మరకలూ లేకుండా ఉంటాడు

గృహస్తాశ్రమంలో ఉన్న జ్ఞానికి సన్యాసాశ్రమంలో ఉన్న జ్ఞానికి మధ్య ఏమైనా తేడా ఉందా అని అడిగిన భక్తునితో శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా చెప్తున్నారు... వారిద్దరూ ఒక తరగతికి చెందినవారే. ఇతడూ జ్ఞానే, అతడు జ్ఞానే. కానీ గృహస్తాశ్రమంలో ఉన్న జ్ఞానికి భయం ఉండనే ఉంటుంద

గృహస్తాశ్రమంలో ఉన్న జ్ఞానికి సన్యాసాశ్రమంలో ఉన్న జ్ఞానికి మధ్య ఏమైనా తేడా ఉందా అని అడిగిన భక్తునితో శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా చెప్తున్నారు... వారిద్దరూ ఒక తరగతికి చెందినవారే. ఇతడూ జ్ఞానే, అతడు జ్ఞానే. కానీ గృహస్తాశ్రమంలో ఉన్న జ్ఞానికి భయం ఉండనే ఉంటుంది. కామినీ కాంచనాల నడుమ నివసిస్తున్నట్లయితే కాస్తో కూస్తో భయం ఉండనే ఉంటుంది. మసిబారిన ఇంట్లో నివసిస్తున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్త వహించినప్పటికి శరీరం మీద కాస్తో కూస్తో నల్లని మరక పడే తీరుతుంది.
 
వెన్న తీశాక దానిని కొత్త కుండలో కనుక పెడితే అది చెడిపోవడానికి ఆస్కారం ఉండదు. కానీ దాన్ని పెరుగు పెట్టిన కుండలో పెట్టినట్లయితే సందేహమే. పేలాలు వేయించేటప్పుడు మూకుడు నుండి ఒకటి రెండు ఎగిరి నేల మీద పడతాయి. అవి ఏమాత్రం మరక లేకుండా మల్లెపువ్వుల్లా ఉంటాయి. మూకుడులో ఉన్న పేలాలు కూడా మంచివే. కానీ అవి మల్లెపువ్వుల్లా ఉండవు. వాటికి కొద్దిగా మరక అంటి ఉంటుంది. అదే విదంగా సన్యాసి జ్ఞానోప లబ్ది పొందాక మల్లెపువ్వులా ఎలాంటి మరకలూ లేకుండా ఉంటాడు. అయితే జ్ఞానం పొందాక సంసారమనే మూకుడిలో ఉండేవాడికి కొద్దిగా ఎర్ర మరక పడే అవకాశం ఉంది.
 
ఒకసారి జనకమహారాజు సభలోకి ఒక భైరవి వచ్చింది. ఆ స్త్రీని చూడగానే జనకుడు తలను కిందకు దించుకుని నేల చూపులు చూడసాగాడు. అది చూసి బైరవి ఇలా అంది. ఓ జనకా... స్త్రీని చూసి నీకింకా భయం వేస్తుందా... పూర్ణజ్ఞానం కలిగినప్పుడు ఐదు సంవత్సరాల బాలుడి స్వభావం ఏర్పడుతుంది. అప్పుడు స్త్రీపురుషులనే భేదభావం ఉండదు. గృహస్తాశ్రమంలో ఉన్న జ్ఞానికి దేహం మీద కొన్ని మరకలు పడవచ్చు. కానీ వాటితో అతడికి కలిగే నష్టమేమి లేదు. చంద్రునిలో మచ్చలు ఉన్నాయి కానీ వాటి వల్ల చంద్రుని ప్రకాశానికి లోటేమి లేదు.