శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (13:50 IST)

మోసుల్‌లో ఐసిస్‌పై భీకర యుద్ధం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న జనం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి తిరిగి మోసుల్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా-ఇరాక్ సంయుక్త బలగాలు గత నెల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే గత రెండు వా

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి తిరిగి మోసుల్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు అమెరికా-ఇరాక్ సంయుక్త బలగాలు గత నెల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే గత రెండు వారాల్లో నవంబర్ 4న 22,224మంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లగా తాజాగా ఒకేసారి 56 వేలమంది వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. అటు ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య బీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీపంలోని ప్రాంతాలకు పరుగులు తీశారు. 
 
బాంబులు, మోర్టార్ షెల్స్, బుల్లెట్ల వర్షంతో మోసుల నగరమంతా మారిమోగిపోతోంది. ఎలాగైన ఉగ్రవాదుల తుడిచిపెట్టి ప్రశాంతమైన నగరాన్ని తిరిగి ప్రజలకు అప్పగించాలనే దృఢనిశ్చయంతో బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో వారంతా ప్రాణాలను అరచేతబట్టుకుని వలసలు పోతున్నారు. వీరికి ఆశ్రయం కోసం షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు.