ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 నవంబరు 2020 (15:23 IST)

ధర్మపురి అర్చకుడితో జోబైడెన్‌... సోషల్ మీడియాలో వైరల్

Joe Biden
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు దిశలో వున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా జోబైడెన్ ధర్మపురికి చెందిన వ్యక్తితో వున్నారనే అనే వార్త వైరల్ అవుతోంది. ధర్మపురికి చెందిన అర్చకుడు కశోజ్జుల చంద్రశేఖర్‌శర్మ కలిసి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 
2003లో అమెరికాలోని వెల్మింగ్టన్‌ సిటీలోని మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి జోబైడెన్‌ రాగా.. అక్కడే అర్చకుడిగా ఉన్న చంద్రశేఖర్‌శర్మ ప్రత్యేక పూజలు చేసి నుదుట తిలకం దిద్దారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చంద్రశేఖర్‌శర్మ శాన్‌ఫ్రాన్సిస్కోలో హన్మాన్‌ ఆలయం నిర్మించి అక్కడే ఉంటున్నారు.  
 
మరోవైపు ఓడిపోతే దేశం విడిచివెళ్లిపోతాను.. ‘ఓడిపోయినా వైట్‌హౌస్‌ నుంచి వెళ్లిపోనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్‌ ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ అమెరికన్‌ జర్నలిస్ట్‌ షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చూసిన వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. 
 
జర్నలిస్ట్‌ పియర్స్‌ మోర్గాన్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఓ పేరడీ వీడియోను ట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో ట్రంప్‌ను వైట్ హౌస్ నుంచి వెలివేసేలా పేరడీలు నవ్వు తెప్పించేలా వున్నాయి.