సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (10:36 IST)

అన్న కిమ్ జోంగ్ నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా అధ్యక్షుడి హస్తం?

అన్న కిమ్ జోంగ్ నామ్ హత్య వెనుక ఆయన తమ్ముడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హస్తముందనే దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వస్తుంది. తన ఐదేళ్ల పదవీకాలంలో వందల మంది వ్యతిరేకులను కిమ్ జోంగ్ ఉన్ హత్య

అన్న కిమ్ జోంగ్ నామ్ హత్య వెనుక ఆయన తమ్ముడు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హస్తముందనే దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వస్తుంది. తన ఐదేళ్ల పదవీకాలంలో వందల మంది వ్యతిరేకులను కిమ్ జోంగ్ ఉన్ హత్య చేయించారన్న అభియోగాలు లేకపోయాయి. ఉన్ ఆగ్రహానికి గురై... శవాలుగా తేలినవారిలో ఆయన మామ జాంగ్ సాంగ్ థాయెక్ కూడా ఉన్నారు. ఇపుడు అన్న కింగ్ జోంగ్ నామ్‌ హత్య వెనుక కూడా ఓ కారణం ఉంది. 
 
ముఖ్యంగా వయసులో ఉన్ కంటే పెద్దవాడైన కారణంగా ఉత్తర కొరియా పీఠానికి పోటీపడేందుకు అవకాశం ఉన్నా.. ఎన్నడూ ఆ విషయంలో నామ్ ఆసక్తి ప్రదర్శించేవాడుకాదని ఆయన సన్నిహితులు చెప్తారు. అయితే, ఉన్ 2010లో దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు మాత్రం నామ్ వ్యతిరేకించాడు. ఉన్ దేశాధ్యక్షుడు కావడం తన తండ్రి అభీష్టమంటూనే.. వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే.. మూడో తరం వారసత్వం చేపట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని జపాన్ టీవీకి చెప్పారు. 
 
నామ్‌కు ఉత్తరకొరియా అధికారవర్గంలో బలమైన నిఘా వ్యవస్థ ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు. చైనాగానీ, అమెరికాగానీ గట్టి మద్దతు ఇస్తే నామ్ దేశాధ్యక్షుడయ్యేవాడని వదంతులు కూడా వచ్చాయి. అదే కిమ్ జోంగ్ ఉన్‌కు ఆగ్రహం కల్గించిందా? అనేది ప్రశ్న. నామ్ జీవించివుంటే ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదన్న భావనతోనే ఉన్ హత్య చేయించివుంటారన్న ఆరోపణలు లేకపోలేదు.