'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్
హైదరాబాద్: పర్యావరణ అనుకూల జీవనాన్ని ప్రోత్సహించడంతో పాటుగా, స్థానిక హరిత బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వడానికి, బుద్ధిపూర్వక వినియోగాన్ని ప్రేరేపించడానికి రూపొందించబడిన ఒక శక్తివంతమైన, పర్యావరణ స్పృహతో కూడిన ఉత్సవం, ది గ్రీన్ ఫ్లీని ఇనార్బిట్ మాల్, సైబరాబాద్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 25 నుండి 27 వరకు జరుగనున్న ఈ కార్యక్రమం అన్ని వయసుల పర్యావరణ ప్రేమికులకు ఉత్సాహభరితమైన, సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తోంది.
ది గ్రీన్ ఫ్లీలో ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఫ్లీ మార్కెట్ ఉంది. ఇది విస్తృత శ్రేణి పర్యావరణ అనుకూల, స్థిరమైన బ్రాండ్‌లను ప్రదర్శిస్తోంది. దీనిలో భాగంగా సేంద్రీయ దుస్తులు, ఉపకరణాల నుండి బయోడిగ్రేడబుల్ హోమ్‌వేర్, సహజ సౌందర్య ఉత్పత్తుల వరకు ఎన్నో ప్రదర్శిస్తున్నారు. అతిథులు జాజ్ నైట్స్ యొక్క ఉత్సాహపూరిత సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు, అంతర్జాతీయ జాజ్ కళాకారుడు సాయంత్రాలలో ప్రత్యక్ష ప్రదర్శన చేస్తున్నారు. వేడుకలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు కుండల వర్క్‌షాప్‌లు, బ్లాక్ ప్రింటింగ్ సెషన్‌లతో సహా ఉచిత ఇంటరాక్టివ్ గ్రీన్ కార్యకలాపాలలో లీనమై పోవచ్చు.
గ్రీన్ ఫ్లీ కేవలం షాపింగ్ అనుభవం కాదు, ఇది రేపటిని హరితమయం చేసే ఒక ఉద్యమం. మీరు పర్యావరణ స్పృహ గల లేబుల్‌లను కనుగొనాలని చూస్తున్నా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా ఒక రోజు గడపాలని చూస్తున్నా ఇనార్బిట్ మీకు ఒక వేదిక అందిస్తుంది.