1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (11:13 IST)

భారత్‌ను ఏకాకిని చేసేందుకే జాదవ్‌కు ఉరిశిక్ష... పాకిస్థాన్ ఎత్తుగడ

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చ

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుగా ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా.. అంతర్జాతీయంగా భారత్‌ను ఏకాకిని చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. 
 
ఇదేవిషయంపై ఉడ్రోవిల్సన్ దక్షణాసియా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ కుగెల్‌మన్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జాదవ్ ఉరిశిక్షను తెరపైకి తెచ్చిందన్నారు. జాదవ్‌ను రక్షించేందుకు భారత్ ముందుకొస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ బేరసారాలకు దిగేందుకు కూడా వెనకాడబోదని అభిప్రాయపడ్డారు.