సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (18:04 IST)

మహిళలకు తెలివితక్కువ.. కొర్విన్ కామెంట్స్.. కౌంటరిచ్చిన గార్షియా

యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో పోలాండ్‌కు చెందిన జానుస్ కొర్విన్ మిక్కీ అనే రాజకీయ వేత్త మహిళలపై విద్వేష ప్రసంగం చేశారు. మగవాళ్ల కంటే.. ఆడవాళ్లు తక్కువ సంపాదించాలన్నారు. వారు బలహీనులని చెప్పారు. తెల

యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో పోలాండ్‌కు చెందిన జానుస్ కొర్విన్ మిక్కీ అనే రాజకీయ వేత్త మహిళలపై విద్వేష ప్రసంగం చేశారు. మగవాళ్ల కంటే.. ఆడవాళ్లు తక్కువ సంపాదించాలన్నారు. వారు బలహీనులని చెప్పారు. తెలివి తక్కువని కామెంట్స్ చేశారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసంపై చర్చ జరుగుతున్న సమయంలో కొర్విన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఈయన చేసిన వ్యాఖ్యలపై ఓ మహిళా ఎంపీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
 
యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో కొర్విన్ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. ఈయన వ్యాఖ్యలపై స్పానిష్ ఎంపీ గార్షియా పెరేజ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. మహిళలు పార్లమెంట్‌కు రావడం మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తోందన్న విషయం అర్థమైందని సెటైర్లు విసిరారు. 
 
యూరోపియన్ మహిళల హక్కుల్ని కాపాడేందుకు తాను సభకు వచ్చానన్నారు. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని.. కొర్విన్‌పై చర్యలు తీసుకోవాలని గార్షియాతో పాటు పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ప్రెసిడెంట్ పార్లమెంట్ రూల్ ప్రకారం ఎంపీ వ్యాఖ్యలపై విచారణ మొదలైంది.