శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (17:16 IST)

ట్రంప్ గారూ.. పోర్న్‌స్టార్ మియా ఖలిఫాను రాయబారిగా నియమించండి.. సో.మీడియాలో వైరల్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడంపై స్వదేశంలోనే నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన విద్వేష భాషనే కారణం. ముస్లింలపై, భార

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికకావడంపై స్వదేశంలోనే నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన విద్వేష భాషనే కారణం. ముస్లింలపై, భారతీయులపై ట్రంప్ విద్వేషపూరితమైన హామీలు ఇవ్వడంతో ట్రంప్‌కు వ్యతిరేకత జోరందుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన హామీలపై కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. 
 
భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. తద్వారా అమెరికాలోని వలసదారులపై కొరడా ఝళిపిస్తానని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపట్ల వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. అంతేగాకుండా ట్రంప్‌ తొలి మహిళా నియామకం ఇదే కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఓ విచిత్రమైన విజ్ఞప్తి ఆన్‌లైన్లో అందింది. ప్రముఖ పోర్న్‌స్టార్‌గా, శృంగార తారగా పేరొందిన మియా ఖలిఫాను సౌదీ అరేబియాకు అమెరికా రాయబారిగా నియమించాలంటూ చేంజ్‌.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ పిటిషన్‌ నమోదైంది. సాంస్కృతిక నేపథ్యాలకు అతీతంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజలను ఓ చోటుకు చేరుస్తున్న ఘనత మియా ఖలిపాదని.. అందుకే..ఆమెను రాయబారిగా నియమించాలని పిటిషన్ అందింది. 
 
కానీ సరదాకు ఆన్‌లైన్లో పెట్టిన పిటిషన్ వెంటనే వైరల్‌గా మారిపోయింది. దీనికి మద్దతుగా ఇప్పటికే 1200మంది సంతకాలు చేశారు. మరో మూడు వందల సంతకాలు వస్తే.. ఈ పిటిషన్‌ అధికారికంగా స్వీకరించేందుకు అర్హత సాధిస్తోంది. మరోవైపు ఈ వైరల్‌ పిటిషన్‌పై సోషల్‌ మీడియాలో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి.