మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (09:05 IST)

పిల్లల్ని కొని వారిని శారీరకంగా హింసించేవాడు.. 12 మంది మైనర్ బాలికలను..!?

మనిషి రూపంలో ఉండే ఒక మాన‌వ‌మృగం… తల్లిదండ్రుల నుంచి అభం శుభం తెలియని పిల్లలను కొనుక్కుని బానిసలుగా మార్చేశాడు. ఆ త‌ర్వాత ఆ ముక్కపచ్చలారని పిల్లలకి నరకాన్ని రుచి చూపిస్తాడు. వాళ్ల‌ను మానసికంగా, శారీర‌క

మనిషి రూపంలో ఉండే ఒక మాన‌వ‌మృగం… తల్లిదండ్రుల నుంచి అభం శుభం తెలియని పిల్లలను కొనుక్కుని బానిసలుగా మార్చేశాడు. ఆ త‌ర్వాత ఆ ముక్కపచ్చలారని పిల్లలకి నరకాన్ని రుచి చూపిస్తాడు. వాళ్ల‌ను మానసికంగా, శారీర‌కంగా నానా హింసలు పెడుతుంటాడు. ఇలా ఒకరు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా... 12 మంది మైన‌ర్ బాలిక‌ల‌ను వాళ్ల త‌ల్లిదండ్రుల వ‌ద్ద నుంచి కొనుగోలు చేసి వాళ్ల‌ని క‌నివినీ ఎరుగ‌ని రీతిలో హింసిస్తుంటాడు. ఎట్ట‌కేల‌కు ఆ మాన‌వ‌మృగం దుర్మార్గాన్ని ప‌క్కింటి మ‌హిళ బయటపెట్టడంతో అస‌లు గుట్టురట్టయ్యింది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే...అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన లీ కప్లన్(51) అనే కామాంధుడు కొంద‌రు మైన‌ర్ బాలిక‌ల‌ను వారి తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసి త‌న ఇంటికి తీసుకెళ్లి వారిని శారీర‌కంగా, మానసికంగా చెప్పుకోలేని విధంగా వేధిస్తుంటాడు. అలా మొత్తం 12 మంది బాలిక‌లకు రోజూ న‌ర‌కం చూపిస్తుంటాడు. లీ ఇంటిపక్కనే ఉండే జెన్ బెట్జ్ అనే మహిళ ఆ బాలికలు పడే వేదనను చూసి తల్లడిల్లిపోయేది. 
 
ఈ విషయాన్ని తన భర్తతో పదేపదే చెప్పిన కూడా అతను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆవిడే ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు లీ ఇంటికి చేరుకుని పరిశీలించగా అక్కడ మొత్తం 12 మంది మైన‌ర్ బాలిక‌లు ఉన్నారు. వీరిలో 14-16-18 సంవ‌త్స‌రాలున్న బాలిక‌లే అధికంగా ఉన్నారు.  వారిలో ఒక అమ్మాయి తనని లీ అక్కడకు 14 ఏళ్ల వయసులో తీసుకొచ్చాడని ఇప్పుడు తన వయసు 16 ఏళ్ల నాలుగు నెలలని చెప్పింది. 
 
లీ ప్రతిరోజు తనను శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. వారిని విచారించగా లీ వద్ద ఉన్న మిగతా పిల్లలు కూడా తమ బిడ్డలనే పోలీసులకు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అధికారులు సాక్ష్యాల కోసం ఆరాతీశారు. కాగా ఈ కేసు ప్ర‌స్తుతం కోర్టులో విచార‌ణ‌లో ఉంది. బాలికలను వేధించినందుకు గాను దాదాపు 1 మిలియన్ డాలర్ల పరిహారాన్ని నిందితుడు చెల్లించాల్సిన అవకాశం ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.