బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (12:04 IST)

రష్యాలో ఘోరం.. మాంసం కోసం యువతిని వివస్త్ర చేసి.. శరీర భాగాలను?

ప్రపంచంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మనిషి మాంసం కోసం యువతిని చంపిన ఘటన రష్యా చోటుచేసుకుంది. దీంతో రష్యాలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ప్రపంచంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మనిషి మాంసం కోసం యువతిని చంపిన ఘటన రష్యా చోటుచేసుకుంది. దీంతో రష్యాలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. నది ఒడ్డున నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని యువతి శవం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ స్థలానికి చేరుకుని వివస్త్రగా పడివున్న అమ్మాయిని చూసి షాక్ అయ్యారు. ఆమె శరీర భాగాలను కత్తితో కోసి వుండటం చూసిన పోలీసులు.. మాంసం కోసమే ఆమెను చంపినట్లు అనుమానిస్తున్నారు.
 
యువతిని హత్య చేసింది ఓ వైద్యుడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మాసం కోసం అమ్మాయిని చంపేశా అనే వార్తను రష్యా మీడియా ప్రసారం చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మానవ మాంసానికి అలవాటు పడిన మానవ మృగాన్ని త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఆ దేశ ప్రభుత్వం విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.