వామ్మో.. కేఎఫ్‌సీ ఆహారంలో పురుగులు.. చికెన్ పాప్ కార్న్‌లో..?
గతంలో కేఎఫ్‌సీ చికెన్‌లో ఎలుకంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో.. తాజాగా కేఎఫ్‌సీ వంటకాల్లో మళ్లీ పురుగులు కనిపించాయి. ఈ ఘటన అమెరికాలోని బిషప్ అక్లాండ్‌లోని దుర్హం ప్రాంతంలో చోటుచేసుకుంది. మల్టీ నేషనల్ బ్రాండ్ అయిన కేఎఫ్‌సీకి జెన్నిఫర్ ఆల్డెర్సన్ అనే మహిళ తన కుమార్తె లిడియా హోనేతో పాటు వెళ్లింది. కేఎఫ్‌సీ అవులెట్‌లో చికెన్ పాప్ కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు.
కొద్ది నిమిషాలకే ఐటమ్ రావడంతో ఇక తినేయడం మొదలెట్టేసింది. ఇంతలో ఆ పాప్ కార్న్ లో ఓ పురుగు కనిపించింది. అది చూసిన హోనే, ఆమె తల్లి షాక్ అయ్యారు. దీంతో కేఎఫ్‌సీ సిబ్బంది ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటన గతంలో కూడా జరిగిందని మరో మహిళ కూడా చెప్పడంతో సదరు సిబ్బందిపై జెన్నిఫర్ మండిపడింది.
ఈ సంఘటనపై కేఎఫ్‌సి సిబ్బంది స్పందిస్తూ, మొక్కజొన్న వంటి ఉత్పత్తుల్లో ఇలాంటివి తప్పులు జరుగుతున్నాయని, ఇందులో తమ తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. మొక్కజొన్నల గింజల్లో పురుగులు ఉన్న కారణంగా ఇలాంటివి జరిగివుండవచ్చునని వివరణ ఇచ్చారు. అంతేగాకుండా సిబ్బంది కస్టమర్లకు క్షమాపణ కూడా చెప్పారు.