శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:27 IST)

అమెరికాపై దాడికి రె ''ఢీ''-క్షిపణికి క్షిపణితో- అణుదాడికి.. అణుదాడితో.. బదులిస్తాం.. ఉత్తర కొరియా

సిరియాపై దాడికి తర్వాత ఉత్తర కొరియా అమెరికాను టార్గెట్ చేసింది. అమెరికాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందుకు జడుసుకున్న డొనాల్డ్ ట్రంప్ చైనాతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఇంకా ఉ

సిరియాపై దాడికి తర్వాత ఉత్తర కొరియా అమెరికాను టార్గెట్ చేసింది. అమెరికాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందుకు జడుసుకున్న డొనాల్డ్ ట్రంప్ చైనాతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. ఇంకా ఉత్తర కొరియాకు కళ్లెం వేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అణు బాంబులతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియాపై ఆకస్మిక దాడులకైనా వెనుకాడవద్దు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం చేస్తున్న కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు.. ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధం ఉన్నట్లు ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా ఆదివారం నిర్వహించిన క్షిపణి ప్రయోగం విఫలమైనప్పటికీ, క్షిపణికి, క్షిపణితో, అణుదాడికి అణుదాడితో అమెరికాకు తాము బదులిస్తామని ఉత్తర కొరియా పేర్కొంది. 
 
అమెరికా సైనిక శక్తిని పరీక్షించే సాహసం చేయవద్దంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హెచ్చరించిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా రాయబారి కిమ్‌ ఇన్‌ ర్యాంగ్‌ ఈ మేరకు ప్రకటించారు. అమెరికా సైనిక దాడులకు సాహసిస్తే ధీటుగా బదులిచ్చేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్లు మైక్ పెన్స్ హెచ్చరించారు.