బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 నవంబరు 2017 (13:24 IST)

తలను గుడ్లగూబలా వెనక్కి ఎలా తిప్పేశాడో చూడండి (వీడియో)

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు తన తలను గుడ్లగూబలా వెనక్కి తిప్పేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కరాచీకి చెందిన మొహమ్మద్ సమీర్ (14) తలను భుజ

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు తన తలను గుడ్లగూబలా వెనక్కి తిప్పేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కరాచీకి చెందిన మొహమ్మద్ సమీర్ (14) తలను భుజాలవరకు తిప్పడాన్ని సర్వసాధారణంగా చేశాడు. అంతకంటే ఏమాత్రం ముందుకు మొహమ్మద్ సమీర్ మాత్రం గుడ్లగూబలా తన తలను 180 డిగ్రీల కోణంలో అవలీలగా వెనక్కి తిప్పేస్తున్నాడు.
 
ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఒక హాలీవుడ్ సినిమాలో నటుడు తన తలను 180 డిగ్రీల కోణంలో తలను వెనక్కితిప్పేశాడని, దాని స్ఫూర్తితో తలను వెనక్కి తిప్పడం సాధన చేసి సక్సెస్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ టాలెంట్‌తో హాలీవుడ్ హారర్ సినిమాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమీర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై ఓ లుక్కేయండి.