ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (16:03 IST)

బిడ్డల్ని చంపేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన తల్లి.. ఇద్దరి చంపేసింది..

crime scene
దక్షిణ కొరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన నవజాత శిశువులను ఇద్దరిని చంపేసింది. ఏళ్ల తరబడి ఫ్రిజ్‌లో భద్రపరిచింది. దీంతో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 2018లో సువాన్ నగరానికి చెందిన ఓ మహిళ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపను చంపి ఫ్రిజ్‌లో పెట్టింది. 2019లో మరో పాపను కూడా కర్కశంగా చంపేసింది. 
 
ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు వున్నా.. పిల్లల పేర్లు నమోదు చేసినట్లు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మే నెలలో ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆమెను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. ఆమె తన నవజాత శిశువులను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. 
 
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అలా చేయవలసి వచ్చిందని తెలిపింది. సెర్చ్ వారెంట్‌తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి.