ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (06:32 IST)

'డోక్లామ్‌'తో చైనా విలవిల : డ్రాగన్ చేష్టలకు తొణకని బెదరని భారత్

డోక్లామ్‌తో చైలా విలవిల్లాడిపోతోంది. డ్రాగన్ చేష్టలకు భారత సైన్యం ఏమాత్రం తొణకకుండా, బెదరకుండా ధీటుగా సమాధానమిస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో చైనా కొట్టుమిట్టాడుతోంది. పైగా, ఇది అంతర్జాతీయం

డోక్లామ్‌తో చైలా విలవిల్లాడిపోతోంది. డ్రాగన్ చేష్టలకు భారత సైన్యం ఏమాత్రం తొణకకుండా, బెదరకుండా ధీటుగా సమాధానమిస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో చైనా కొట్టుమిట్టాడుతోంది. పైగా, ఇది అంతర్జాతీయంగా పరుపు ప్రతిష్టలతో కూడుకున్న సమస్య కావడంతో ఆచితూచి అడుగులు వేస్తోంది. 
 
డోక్లామ్ వివాదం ఒకటి రెండు, రోజుల్లో తేలిపోతుందనుకున్న వివాదం అప్పుడే రెండు నెలలు దాటింది. అయినా పరిష్కారం దొరకడం లేదు. తన ఆయుధపాటవానికి, రణ శంఖారావానికి భారత్‌ భయపడుతుందన్న చైనా అభిప్రాయాలు వాస్తవరూపం దాల్చలేదు. మీడియా ద్వారా పలు బెదిరింపులు, హెచ్చరికలు, ప్రకటనలు చేసినా భారత్‌ దళాలు ఏ మాత్రం బెదరడం లేదు సరి కదా సై అంటే సై అంటున్నాయి. దీంతో ఏం చేయాలో బీజింగ్‌కు దిక్కుతోచడం లేదు. 
 
చైనా, సిక్కిం, భూటాన్‌ సరిహద్దుల్లో ట్రైజంక్షన్‌గా పిలిచే డోక్లామ్‌ ప్రాంతం భూటాన్‌ది. అయితే తమదిగా పేర్కొంటూ చైనా సాయుధదళాలు ఈ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి యత్నించాయి. భూటాన్‌ అభ్యర్థన మేరకు భారత సాయుధదళాలు చైనాను అడ్డుకున్నాయి. దీంతో భంగపడిన చైనా అది చైనా ప్రాదేశిక భూభాగమంటూ భారత దళాలు తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తోంది. 
 
బోర్లాపడిన చైనా గతంలోనూ తమ సరిహద్దు దేశాలతో ఇలాంటి గొడవలు పెట్టుకొని పలుదేశాల భూభాగాలను ఆక్రమించుకున్న చైనా డోక్లామ్‌ అంశంలో అతి విశ్వాసంతో వ్యవహరించడంతో సమస్య జఠిలమైందని చెప్పవచ్చు.