గురువారం, 26 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 10 మే 2016 (13:09 IST)

అబ్బా... 80 ఏళ్ల బామ్మకు మేకప్ అదిరింది గురూ.. మీరు చూడండి..!

క్రొయేషియాకు చెందిన లివియా అనే బామ్మ‌కు 80 ఏళ్లు. 80 ఏళ్ల వ‌య‌స్సులోను 18 ఏళ్ల పడుచులా నవయవ్వనంగా క‌నిపించాల‌ని తెగ తాపత్రయపడుతుంది. అందుకోసమే ఈ వ‌య‌స్సులో కూడా భారీ మేకప్, ఫేషియ‌ల్‌లు వేసుకుని ముస్తాబవుతోందీ భామ. ఈ బామ్మ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికే ఇంట్లోనే ఒక మేకప్ ఆర్టిస్ట్‌ని పెట్టుకుంది. ఆ మేకప్ ఆర్టిస్ట్‌ ఎవరో కాదు ఈవిడ మనవరాలు. 
 
బామ్మ మ‌న‌వ‌రాలు టీ ఫ్లిగో స్వ‌త‌హాగా మేక‌ప్ ఆర్టిస్ట్ కావ‌డంతో బామ్మ ముఖానికి రంగురంగులద్ది అందంగా తీర్చిదిద్దుతుందట. ఎంత‌లా అంటే ఏకంగా హాలీవుడ్ స్టార్ కిమ్ క‌ర్దాషియ‌న్ వేసుకునే మేక‌ప్ స్టైల్‌ను ఫాలో అయిపోయిందట. అలా ఆ బామ్మ ముఖానికి మేక‌ప్ వేసి ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ బామ్మ ఫోటో‌స్‌‌కి ఏకంగా 48వేల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారట.. ఆశ్చర్యంగా ఉంది కదూ...!