శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (13:39 IST)

జూకు వచ్చిన గర్భవతిని ఆప్యాయత పలకరించిన పెద్దపులి.. కడుపులోని బిడ్డను?

క్రూర మృగాలంటేనే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది.. ఓ గర్భం ధరించిన మహిళ రాయల్ బెంగాల్ టైగర్‌తో ఆడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టినింట వైరల్‌ అవుతోంది. బ్రిట్నీ స్పియర్స్ అనే యువతి.. తన

క్రూర మృగాలంటేనే ఆమడ దూరం పారిపోతాం. అలాంటిది.. ఓ గర్భం ధరించిన మహిళ రాయల్ బెంగాల్ టైగర్‌తో ఆడుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టినింట వైరల్‌ అవుతోంది. బ్రిట్నీ స్పియర్స్ అనే యువతి.. తన కజిన్, నిండు గర్భంతో ఉన్న నటాషా హ్యాండ్ షోను తీసుకుని ఇండియానాలోని పొటావాటోమి జూకు వెళ్లిన వేళ ఈ ఘటన జరిగింది. 
 
తన ఎన్ క్లోజర్ లో అద్దం వెనక ఉన్న పులితో సెల్ఫీ దిగేందుకు నటాషా ప్రయత్నించిన వేళ జరిగిన ఘటనను వీడియో తీసిన బ్రిట్నీ దాన్ని ఫేస్ బుక్‌లో షేర్ చేసుకోగా.. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. 
 
తాము జూకు వెళ్ళినప్పుడు ఓ అందమైన పెద్దపులి తన కజిన్ గర్భవతి అని తెలుసుకుని ఆమెను ఆప్యాయంగా పలకరించింది. కడుపులోని బిడ్డను పలకరించాలనుకుంది. ఇదెంతో స్వీటెస్ట్ మూమెంట్ అంటూ ఓ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో మీ కోసం..