శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (11:23 IST)

జియో ఎఫెక్ట్ ‌: వోడాఫోన్‌ కొత్త ఆఫర్‌.. 70 డేస్ .. 70 జీబీ 4జీ డేటా

రిలయన్స్ జియో ధాటికి అన్ని టెలికాం కంపెనీలు కుదేలైపోతున్నాయి. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని, తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంలో పోటీపడుతున్నాయి.

రిలయన్స్ జియో ధాటికి అన్ని టెలికాం కంపెనీలు కుదేలైపోతున్నాయి. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని, తమ వినియోగదారులు చేజారిపోకుండా ఉండేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంలో పోటీపడుతున్నాయి. ఈ కోవలో వోడాఫోన్ తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. రూ.244 రీచార్జ్‌పై 70 జీబి 4 జీ డేటా అన్‌ లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ ఆఫర్ 70 రోజుల కాలపరిమితిని కల్పించింది. 
 
వోడాఫోన్ ఈ కొత్త ప్లాన్‌ రూ.244ల మొబైల్ డేటా ప్లాన్ కొత్త వినియోగదారులకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. దీని ప్రకారం రోజుకు 1జీబీ డేటా ఉచితం. దీనికితోడు 70 రోజులపాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందవచ్చు. రెండోసారి ఇదే మొత్తానికి రీచార్జ్ చేసుకుంటే మాత్రం అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యం కొనసాగినప్పటికీ ప్లాన్‌ చెల్లుబాటు కాలం మాత్రం 35 రోజులకే పరిమితం చేశారు.