బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 జులై 2017 (12:42 IST)

ఎయిర్‌టెల్, వొడాఫోన్ అందరికీ షాకిస్తూ ముకేష్ అంబానీ.... 22 భాషల్లో జియో ఫోన్...

ముకేష్ అంబానీయా మజాకా... ఒకే ఒక్క దెబ్బతో ఇప్పటివరకూ డిజిటల్ ప్రపంచంలో వున్న డబ్బుకే నెట్ చూడండి అనే ఫార్ములాకు చెక్ పెట్టేశారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న భారతీయులందరికీ ఉచితంగా జియో ఫోన్ అని సంచలన ప్రకటన చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు

ముకేష్ అంబానీయా మజాకా... ఒకే ఒక్క దెబ్బతో ఇప్పటివరకూ డిజిటల్ ప్రపంచంలో వున్న డబ్బుకే నెట్ చూడండి అనే ఫార్ములాకు చెక్ పెట్టేశారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న భారతీయులందరికీ ఉచితంగా జియో ఫోన్ అని సంచలన ప్రకటన చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఇది భారతీయులకు మాత్రమే. 
 
నిజంగా... ఇలాంటి సౌలభ్యం ఎక్కడైనా వుందా అని భూతద్దంలో వెతికినా కనబడని వైనం. రిలయన్స్ జియో ఫోన్ సంచలన ఫీచర్లతో ఉచితంగా అందించాలన్న నిర్ణయం అసాధారణమైనదే. ఐతే భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ కోసం అంబానీ ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇక ఇప్పుడు అసలైన పోరు మొదలైనట్లే. ఎందుకంటే ఇప్పటివరకూ వాయిస్ చార్జెస్, డేటా చార్జెస్ పేరుతో ఇతర కంపెనీలు వసూలు చేస్తున్న మొత్తాలకు గండి పడినట్లే. ఇప్పటికే జియో ఉచిత ఆఫర్లు ప్రకటించిన సమయంలో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా తదితర కంపెనీలు ట్రాయ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపధ్యంలో ఈ కంపెనీలపై పిడుగులా మరో వార్త... జియో ఉచిత ఫోన్. అది కూడా 22 భాషల సౌలభ్యత. ఈ ఫోన్ దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర కంపెనీలకు భారీ కుదుపు తప్పేలా లేదు. మరి ఆ కంపెనీలు అంబానీ సునామీని ఎలా తట్టుకుని నిలబడతాయో వేచి చూడాల్సిందే.