హేయ్ మోడ్స్, హైలైట్ మోబి, హేయ్ వాట్సాప్.. ఇవి చాలా డేంజర్
ప్రముఖ సోషల్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ ఖాతాల వివరాలను చైనా సంస్థలు తస్కరించాయంటూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. హేయ్ మోడ్స్, హైలైట్ మోబి, హేయ్ వాట్సాప్ పేరిట ఈ సంస్థలు అనధికార వాట్సాప్‌లుగా చెలామణీ అవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. వీటి ప్రధాన కార్యాలయాలు చైనాలో ఉన్నట్టు తెలిసింది. ఈ నకిలీ యాప్‌లపై వాట్సాప్ గత కొంతకాలంగా యూజర్లకు హెచ్చరికలు చేస్తోంది.
ఈ నకిలీ వాట్సాప్ వేదికలు అధికారిక యాప్‌లలో లేని అదనపు ఫీచర్లను సైతం అందిస్తూ యూజర్లకు గాలం వేస్తుంటాయి. ఇవి థర్డ్ పార్టీ ఏపీకే సైట్లలోనూ, గూగుల్ ప్లే స్టోర్‌లోనూ అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. ఈ నకిలీ యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుంటే మాల్వేర్లను ఆహ్వానించినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.