బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (18:06 IST)

టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్ - వీడియో కాల్‌లో ఒకేసారి 1000 మంది...

ప్ర‌ముఖ స్వదేశీ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. దీంతో సరికొత్త ఫీచ‌ర్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెలిగ్రామ్ నిరంతరం ప్రయత్నిస్తుంది. ఇందులోభాగంగా తాజాగా సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 
 
రోజురోజుకూ టెలిగ్రామ్ ను ఉప‌యోగించే వాళ్ల సంఖ్య పెరుగుతుండ‌టంతో యాప్‌ను కూడా స‌రికొత్త‌గా తీర్చిదిద్దుతోంది. వాట్స‌ప్‌కు పోటీగా వ‌చ్చిన దేశీయ యాప్ టెలిగ్రామ్.. ఇప్ప‌టికే తన యూజ‌ర్ల కోసం చాలా ఫీచ‌ర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
 
తాజాగా మ‌రో అప్ డేట్‌‌తో ముందుకు వచ్చింది. టెలిగ్రామ్‌లో ఉన్న వీడియో కాలింగ్ ఫీచ‌ర్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూప్ వీడియో కాల్‌లో 1000 మంది వ‌ర‌కు పార్టిసిపెంట్స్ యాడ్ కావచ్చు. ఇదివ‌ర‌కు 1000 మంది వ‌ర‌కు గ్రూప్ వీడియో కాలింగ్‌‍లో యాడ్ అయ్యే అవ‌కాశం ఉండేది కాదు. 
 
తాజాగా వ‌చ్చిన ఫీచ‌ర్‌లో 30 మంది వ‌ర‌కు గ్రూప్ వీడియో కాల్‌ను బ్రాడ్ కాస్ట్ చేసే అవ‌కాశం ఉంటుంది. ఆ కాల్‌లో వెయ్యి మంది వ‌ర‌కు యాడ్ కావ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ఎక్కువ‌గా కంపెనీ మీటింగ్స్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌నుకునే వాళ్ల‌కు, ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించే వాళ్ల‌కు కూడా ఈ ఫీచ‌ర్ అద్భుతంగా పని చేస్తుందని ఈ ఫీచర్ పేర్కొంది.