ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (12:53 IST)

భారత్‌లో 6జీ నెట్‌వర్క్‌.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య

6G
6G
భారతీయ యూజర్లు 6జీ టెక్నాలజీని వినియోగించనున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 8వ "ఇండియా మొబైల్ కాంగ్రెస్"లో కీలకమైన 6జీ ప్రణాళికలను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
 
గ్లోబల్ టెక్నాలజీ పోటీలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యాన్ని అనుసరించి.. అధికారికంగా 6జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన మొదటి దేశంగా భారత్‌ను నిలిపేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 
 
4జీ, 5జీ టెక్నాలజీల వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందని, ఇక 6జీ వినియోగంలో కూడా ముందుంటామని మంత్రి జ్యోతిరాదిత్య విశ్వాసం వ్యక్తం చేశారు. 6జీకి ఆమోదం తెలిపిన తొలి దేశం మనదే కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని చెప్పారు.
 
కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా 6జీ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి వస్తే.. 6జీ సాంకేతికతను వినియోగించనున్న తొలి వ్యక్తులుగా దేశంలోని రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్, వీ (వాడా-ఐడియా) యూజర్లు నిలవబోతున్నారు.