శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (14:38 IST)

'సరైనోడు' కోసం ఐటమ్ సాంగ్ చేయనన్న ఇలియానా: అంజలి ఐటెం సాంగ్ ఫీజు రూ.20 లక్షలే!

'సన్నాఫ్ సత్యామూర్తి' సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు' పేరుతో యాక్షన్ ఎంటర్ టైనర్‌లో మన ముందుకు రాబోతున్నాడు. బోయపాటి శీను, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకే ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌ని ఇలియానాతో చేయించాలని దర్శకనిర్మాతలు భావించారు.
 
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌లో చివరి సినిమా చేసి ఇప్పచికే 4 ఏళ్ళకి పైగా అవుతుంది. అల్లుఅర్జున్‌తో 'జులాయి' సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ భామ అక్కడ కూడా అవకాశాలు చేజిక్కించులేక పోయింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ సరసన 'రుస్తుం' అనే సినిమాలో ఆఫర్ కొట్టేసిన ఈ భామ తెలుగులో వచ్చిన ఆఫర్స్ అన్నీ వదులుకుంది. అయితే 'సరైనోడు'లో ఐటమ్ సాంగ్ కోసం ఇలియానాను సంప్రదిస్తే చేయనంటే చేయను అని గట్టిగానే చెప్పేసిందట. దీంతో నిర్మాత కోటి ఆఫర్ చేశారట. దీనికి కూడా ససేమిరా నో చెప్పడంతో తర్వాత ఈ సాంగ్ కోసం సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనుష్కను సంప్రదించారు. 
 
అనుష్క లీడ్ రోల్‌లో నటించిన 'రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ క్యారెక్టర్ చేయటంతో అందుకు కృతజ్ఞతగా అనుష్క కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని అందరూ భావించారు. అయితే అనుష్క కూడా పక్కకు తప్పుకుందట. ఫైనల్‌గా అంజలిని ఈ సాంగ్ కోసం సంప్రదించారట. గతంలో ''సింగం 2'' సినిమా కోసం ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడిన అంజలి మరోసారి 'సరైనోడు'లో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అనుష్కని అనుకున్నా చివరికి రూ.20 లక్షల్లో అంజలి సెట్ అయ్యిందట. ఇలియానా మిస్ అయినందుకు ముందు అల్లుఅరవింద్ ఫీల్ అయినా అంజలి అంత తక్కువలో అందచందాలు ఆరబోయడంతో దర్శకనిర్మాతలు తెగ సంతోషపడుతున్నాడట.