శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2024 (16:49 IST)

కంగనా రనౌత్ ఓ హీరోయిన్ అనుకోకండి, ఆమే మీ సోదరి, కుమార్తె: కంగనా కామెంట్స్

Kangana Ranaut
కర్టెసి-ట్విట్టర్
కంగనా రనౌత్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో రోడ్ షో నిర్వహిస్తూ తనను ఎందుకు గెలిపించాలో ప్రజలకు వివరించి చెబుతున్నారు.
 
కంగనా రనౌత్ అనే మహిళ ఓ హీరోయిన్. ఆమె కేవలం హీరోయిన్ మాత్రమే అనుకోకండి, ఆమే మీ సోదరి, కుమార్తె కూడా. మీ సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం మీకు అందుబాటులో వుంటాను. ప్రజా సమస్యలను పరిష్కరించి మండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానంటూ కంగనా రనౌత్ రోడ్ షోలో చెప్పుకుంటూ వెళుతున్నారు.