గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By వరుణ్

ఆ కుటుంబంలో ఏకంగా 350 ఓటర్లు.. ఎక్కడ?

voters list
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి నెలకొనివుంది. ఈ నెల 19వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని ఓ కుటుంబ వార్త ఇపుడు పతాక శీర్షికలెక్కింది. ఆ కుటుంబంలో ఏకంగా 350 ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం. అస్సాం రాష్ట్రంలోని సోనిట్‌పూర్ జిల్లాలోని పులోగురి నేపాల్ పామ్ గ్రామంలో ఈ 350 మంది ఓటర్లు ఉన్న కుటుంబం ఉంది. ఈ గ్రామానికి చెందిన రోన్ బహదూర్ తాపాకు ఐదుగురు భార్యలు. వారి ద్వారా 12 మంది మగపిల్లలు, 9 మంది ఆడపిల్లలు కలిగారు. వారికి కూడా పెళ్లిళ్లు, పిల్లలు కలగడంతో మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య ఏకంగా 1200కు చేరింది. 
 
దీంతో ప్రస్తుతం ఆ కుటుంబంలో ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వారందరూ ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పైగా, ఒకే ఇంటిలో ఏకంగా 350 ఓట్లు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఆ ఇంటికి క్యూ కడుతున్నారు. అస్సాంలో అత్యధిక ఓటర్లు ఉన్న కుటుంబాల జాబితాలో తాపా కుటుంబం మొదటి స్థానంలో ఉంది. ఇదిలావుంటే, ఈ రాష్ట్రంలోని 14 లోక్‌సభ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7వ తేదీన ఈ పోలింగ్ జరుగుతుంది. 
 
ఆంధ్రాలో రాళ్లతో కొట్టుకుంటున్నారు... టీ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాళ్లతో కొట్టుకుంటున్నారని, ఈ సంస్కృతి పోవాలంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నేత నేత జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి ఘటన.. మరో కోడికత్తి డ్రామా వంటిదని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, న్యాయంగా ఆలోచన చేస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అపుడు ఈ రాళ్లతో కొట్టుకోవడాలు ఉండవన్నారు. ఏపీలో రాళ్లతో కొట్టుకుంటున్నారని, జగన్ రాయితో కొట్టుకున్నాడని ఒకరు.. చంద్రబాబే కొట్టాడని మరొకరు చెబుతున్నారన్నారు. ఏపీ ప్రజలు కూడా అర్థం చేసుకోవడం లేదన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. 
 
ఏపీలో ఈ అంశాలను తాను టీవీలో చూశానని చెప్పారు. ఏపీ వారికి విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన కోపం ఉన్నట్టుగా చెబుతున్నారని, కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయామని, ఎవరికి వారు స్వయం పాలన చేసుకుంటున్నామని తెలిపారు. ఇపుడు ఏపీ ప్రజలు కూడా ఆలోచించాలని ఆయన కోరారు. మీకు స్వయంపాలన రావడం వల్ల మీ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరంలో ఉండటం లేదని, ఏపీలోనే గల్లీల్లో తిరుగుతున్నారని చెప్పారు. ఇందుకు కారణం రాష్ట్ర విభజన, సోనియా గాంధీ అన్నారు. దీనిని ప్రజలు కాస్త ఆలోచించాలని కోరారు. అందుకే న్యయంగా ఆలోచిస్తే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.