గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (22:54 IST)

మరో 3 బ్యాంకులు విలీనం?

మరో మూడు బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహరాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లను విలీనం చేయాలన్న నీతి ఆయోగ్‌ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చలు ప్రారంభించారు.

అయితే ఈ మూడింటిని ఏయే బ్యాంకుల్లో విలీనం చేసేదీ ఇంకా వెల్లడి కాలేదు. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. వాటితోపాటు ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపిపిబి) ప్రభుత్వం రంగంలో ఉంది.

తాజాగా మూడు బ్యాంకులు విలీనం చేస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 నుంచి 9కి తగ్గుతుంది. మోడీ హయంలో 14 బ్యాంకులను వేరే బ్యాంకుల్లో విలీనం చేశారు. వీటినీ కలిపితే విలీనం చేసిన బ్యాంకుల సంఖ్య 17కి చేరుతుంది.