శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (18:27 IST)

తలపాకట్టి బిర్యానీలో రక్తపు మరకతో కూడిన బ్యాండేజ్..

హైదరాబాద్ బిర్యానీకి మస్తు ఫేమస్. అలాగే తమిళనాడులో తలపాకట్టు అంటే భలే పాపులర్. అయితే అలాంటి సంప్రదాయ తలపాకట్టు హోటల్‌లో కస్టమర్లకు షాకిచ్చే ఘటన చోటుచేసుకుంది. గతంలో ఏదో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే అందులో రక్తపు మరకతో కూడి బ్యాండేజ్ కనిపించింది. ప్రస్తుతం అదే సీన్ తలపాకట్టు బిర్యానీలో రిపీట్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఈరోడుకి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి కరూర్ బస్టాండుకు సమీపంలోని తలపాకట్టి బిర్యానీ సెంటర్‌కు వెళ్లాడు. అక్కడి  బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ ప్లేటు కూడా వచ్చేసింది. అయితే అక్కడే షాక్ ఎదురైంది. రక్తపు మరకతో కూడిన బ్యాండేజ్.. బిర్యానీలో కనిపించింది. దీని గురించి బిర్యానీ సెంటర్‌లో వున్న వారి వద్ద ఫిర్యాదు చేస్తే వారు ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
వెంటనే ఆ వ్యక్తి ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇంకా బిర్యానీలో వున్న బ్యాండేజ్‌ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ సెంటర్లో ఫుడ్ కార్పొరేషన్ అధికారులు రైడ్ నిర్వహించారు.
 
ఆ రైడ్‌లో బిర్యానీలో నాణ్యత కొరవడకపోయినా.. బిర్యానీలో బ్యాండేజ్ ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆ హోటల్‌లో కస్టమర్లకు అందించే బిర్యానీ దిండుక్కల్‌లో తయారీ చేయబడుతోందని.. అక్కడ విచారణ జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు.