బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జనవరి 2020 (18:53 IST)

నవ వధువుపై సామూహిక అత్యాచారం.. అత్తారింటికి వెళ్లిన మరునాడే?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ నవ వధువు పెళ్లైన మరునాడే కామపిశాచులకు బలైపోయింది. ఈ ఘటన దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని థానా దేహాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గత శుక్రవారం వివాహం అయిన నవ వధువు కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. కానీ మరుసటి రోజే ఆమె కిడ్నాప్ అయ్యింది. అంతేకాకుండా సామూహిక అత్యాచారానికి గురైంది. థానా దేహాడ్ ప్రాంతానికి చెందిన యువకుడితో.. 17వ తేదీన బాధితురాలికి వివాహం అయ్యింది. అత్తారింటికి వచ్చిన మరుసటి రోజే ఆమె కిడ్నాప్‌కు గురైంది. చివరికి బంధుమిత్రులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం నాడు హాపూర్ లోని ఓ బ్యాంకు శాఖ సమీపంలో నవ వధువు అపస్మారక స్థితిలో కనిపించింది. ఇంటి నుంచి ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఏమీ మాట్లాడలేని స్థితిలో వుందని పోలీసులు చెప్తున్నారు.