సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (17:28 IST)

స్వలింగ వివాహాలపై కేంద్రం వైఖరి ఏంటో తెలుసా?

Same Gender
Same Gender
స్వలింగ వివాహాలపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించడంపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. వీటిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు పార్లమెంట్ మాత్రమే సరైన వేదిక అంటూ పేర్కొంది. 
 
భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టపరమైన హోదా కల్పించడంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేని తరుణంలో.. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో మంగళవారం వాదనలు ప్రారంభం అయ్యాయి. 
 
దీనిపై కేంద్రం మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇంకా సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరపడంపై అభ్యంతరం తెలిపింది. కొత్త సామాజిక సంబంధాల అంశాలపై కేవలం పార్లమెంట్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని పేర్కొంది. దీనిపై చీఫ్ జస్టిస్ డి.వై చంద్రచూడ్ స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కోర్టుకు చెప్పనవరసం లేదని.. తాము మొదట పిటిషినర్ల వాదనలు వింటామని స్పష్టం చేశారు.