శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2025 (15:37 IST)

ఢిల్లీలోని 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు- 12వ తరగతి స్టూడెంట్ అరెస్ట్

crime scene
ఢిల్లీలోని 23 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు పంపినందుకు 12వ తరగతి విద్యార్థినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు పంపినందుకు 12వ తరగతి విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
గురువారం దాదాపు 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన తర్వాత చర్య తీసుకుంది. ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు పంపిన చివరి 23 బెదిరింపు ఈ-మెయిల్‌లకు నిందితుడే కారణమని దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకిత్ చౌహాన్ తెలిపారు. 
 
విచారణ సమయంలో, అతను గతంలో కూడా బెదిరింపు ఈమెయిల్‌లు పంపినట్లు అంగీకరించాడని చౌహాన్ తెలిపారు. మైనర్ అయిన ఆ విద్యార్థిని దక్షిణ జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తూ, నగరం ఇంత దారుణమైన శాంతిభద్రతలను ఎప్పుడూ చూడలేదన్నారు.
 
దీనికి ప్రతిస్పందనగా, పోలీసులు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి ఇటువంటి బెదిరింపులను ఎదుర్కోవడానికి శిక్షణ ఇస్తున్నారు. అటువంటి పరిస్థితులకు వారిని సిద్ధం చేయడానికి విద్యా శాఖతో ఒక సెమినార్ నిర్వహించారు.
 
ఈ మోసాలు విమానయాన సంస్థలను కూడా ప్రభావితం చేశాయి. బహుళ బాంబు బెదిరింపులు అత్యవసర ల్యాండింగ్‌లు, విమానాల ఆలస్యం, అదనపు ఇంధన వినియోగానికి దారితీశాయి.