శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 8 జూన్ 2017 (03:14 IST)

అమ్మాయిలు హీరోల్లా చూస్తారని ఉగ్రవాదుల్లో చేరతారా నాన్నా..!

నమ్మిన ఆశయం కోసం ప్రాణాలను ధారపోయడానికి సిద్ధపడటం ఉద్యమాలు నేర్పే త్యాగపూరిత జీవితానికే సాధ్యం. ఆశయ సాధన లక్ష్యం పట్ల అంకితభావమే నవ యువతీయువకులను ఉడుకు రక్తంతో, ఆవేశంతో ఉద్యమాలవైవు ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఉద్యమాలు ఎలాంటవైనా కావచ్చు. కానీ జనం వారిని నమ

నమ్మిన ఆశయం కోసం ప్రాణాలను ధారపోయడానికి సిద్ధపడటం ఉద్యమాలు నేర్పే త్యాగపూరిత జీవితానికే సాధ్యం. ఆశయ సాధన లక్ష్యం పట్ల అంకితభావమే నవ యువతీయువకులను ఉడుకు రక్తంతో, ఆవేశంతో ఉద్యమాలవైవు ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ ఉద్యమాలు  ఎలాంటవైనా కావచ్చు. కానీ జనం వారిని నమ్మేది వారి స్వార్థ త్యాగాన్ని, ప్రాణాలను తృణప్రాయంగా త్యజించే మహా సంకల్పాన్ని మాత్రమే. 
 
కానీ కశ్మీర్ యువతలో కొందరికి స్వతంత్ర పోరాటం అంటే క్రేజి. ప్రజల్లో తమకు హీరోగా గుర్తింపు వస్తుందని కాదు. ఉగ్రవాదుల్లో చేరితే తోటి అమ్మాయిలు తమను హీరోలుగా చే్స్తారని వారు ఉగ్రవాదుల్లో చేరుతున్నారట.  ఆశయ సాధన కోసం కాకుండా అమ్మాయిల మెప్పు కోసం ఉగ్రవాద అద్యమంలో చేరటం వింత గొలుపుతోంది.  లొంగిపోయిన హిజ్బుల్ ఉగ్రవాది డానిష్ అహ్మద్ చెప్పిన ఈ కొత్త క్రేజీ గురించి విన్న పోలీసు అధికారులు ఇదెక్కడి క్రేజీరా నాయనా అంటూ తలపట్టుకుంటున్నారు. 
 
విషయంలోకి వస్తే..హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాది సబ్జార్‌ భట్‌ అంత్యక్రియల్లో హల్‌చల్‌ చేసిన అనుమానిత ఉగ్రవాది డానిష్‌ అహ్మద్‌ సోమవారం కశ్మీర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. త్రాల్‌లో జరిగిన సబ్జార్‌ అంత్యక్రియల ఫొటేజీతో డానిష్‌ అహ్మద్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసుల వద్ద డానిష్‌ అహ్మద్‌ వెల్లడించిన విషయాలు విస్తుగొల్పుతున్నాయి. 
 
హంద్వారాలోని కులంగావ్‌ ప్రాంతానికి చెందిన డానిష్‌.. డూన్‌ పీజీ కాలేజీలో అగ్రికల్చర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. 2016లో హంద్వారా ప్రాంతంలో సైన్యంపై జరిగిన రాళ్లదాడుల్లో అతడు పాల్గొన్నట్లు వెల్లడైంది. ఉగ్రవాదం వైపు మళ్లిన చాలా మంది యువత అసంతృప్తితో ఉన్నారని, అయితే స్థానిక కమాండర్‌ల నుంచి ప్రాణహాని ఉండటం వల్ల వారు లొంగిపోవడానికి భయపడతారని డానిష్‌ తెలిపాడు.
 
అలాగే.. ఉగ్రవాదులతో చేతులు కలిపినవారిని లోకల్‌ అమ్మాయిలు హీరోలుగా చూస్తారన‍్న భావనతో.. వారితో ఫ్రెండ్‌షిప్‌ చేసేందుకు కొంత మంది యువత ఉగ్రవాదం వైపు వెళ్తున్నారని డానిష్‌ వెల్లడించాడు. స్థానికంగా తగాదాలను పరిష‍్కరించడంతో పాటు.. ధనవంతుల నుంచి ఉగ్రవాదులు ’ప్రొటెక్షన్‌ మనీ’ వసూలు చేస్తారని విచారణలో డానిష్‌ అహ్మద్‌ తెలిపాడు.
 
అమ్మాయిలకోసం సాహసాలు చేసే వారిని చూశాం. వ్యక్తిగత హీరోయిజం ప్రదర్శించే వారిని చూశాం. కానీ అమ్మాయిల మెప్పుకోసం ప్రాణాంతక ఉద్యమాలకు వెళ్లేవారిని మాత్రం కశ్మీర్ లోనే చూస్తున్నాం. ఇదెక్కడి క్రేజీరా బాబో అంటూ అధికారులు తల పట్టుకుంటున్నారు.