శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2017 (13:20 IST)

పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

ఉత్తరాదిన పానీ పూరీలకు మంచి క్రేజ్. చాట్ ఐటమ్స్‌లో ముందున్న పానీ పూరీలను సాయంత్రం పూట రోడ్లపై నిల్చుని చాలామంది తినేస్తుంటారు. అయితే పానీపూరీ తినడం వల్ల ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని

ఉత్తరాదిన పానీ పూరీలకు మంచి క్రేజ్. చాట్ ఐటమ్స్‌లో ముందున్న పానీ పూరీలను సాయంత్రం పూట రోడ్లపై నిల్చుని చాలామంది తినేస్తుంటారు. అయితే పానీపూరీ తినడం వల్ల ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పానీపూరీ అంటే ఇష్టం లేని వారుండరు. కానీ పానీపూరీ తినేటప్పుడు కిక్ కోసం చాలావేగంగా తినడమే.. ఆ వ్యక్తి మృతికి కారణమైందని వైద్యులు చెప్తున్నారు. 
 
ఎలాగంటే... కాన్పూరుకు చెందిన నరేష్ కుమార్ సచాన్ అనే వ్యక్తి పానీపూరీ తినే సమయంలో అది గొంతుకు అడ్డం పడింది. అందులోని నీరు కడుపులోకి వెళ్లాల్సింది పోయి ఊపిరితిత్తుల్లోకి పోయింది. దీంతో అతను చనిపోయాడు. అందుకే పానీపూరీలు తినేటప్పుడు వేగంగా తినడం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.