శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (12:33 IST)

మరదలిని రేప్ చేసిన బావ... ఢిల్లీ సెషన్స్ కోర్టు జడ్జి ఏమన్నారంటే...

ఢిల్లీలో తమతో పాటు నివశించే మరదలిపై కామంతో కళ్లుమూసుకునిపోయిన బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదన

ఢిల్లీలో తమతో పాటు నివశించే మరదలిపై కామంతో కళ్లుమూసుకునిపోయిన బావ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం అంటే కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదని, ఓ నిస్సహాయురాలైన మహిళ ఆత్మను నాశనం చేయడమేనని పేర్కొంది. 
 
ఢిల్లీలోని ఓ కాలనీలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లిన నిందితుడు, ఆ సమయంలో అక్కడే ఉన్న తన మరదలిపై బావ అత్యాచారం చేశాడు. ఆపై మరోసారి అదేప్రయత్నం చేయడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ అత్యాచారం 2016 మార్చి 26వ తేదీన జరిగింది. 
 
ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సంజీవ్ జైన్ విచారించి అత్యాచారం అంటే కేవలం శరీరంపై దాడి కాదని, బాధితురాలి వ్యక్తిత్వాన్ని, ఆత్మనూ చరచడమేనని వ్యాఖ్యానించారు. నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానాను విధించారు. 
 
పైగా, తనను అన్యాయంగా ఇరికించాలన్న నిందితుడి వాదనను కొట్టి పారేసిన న్యాయమూర్తి, సంప్రదాయ సమాజంలోని ఏ యువతి కూడా తాను అత్యాచారానికి గురయ్యానన్న తప్పుడు ఫిర్యాదులు ఇవ్వబోదని వ్యాఖ్యానించడం గమనార్హం.