బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:03 IST)

దేశవ్యాప్తంగా 5 పురావస్తు కేంద్రాల అభివృద్ధి

దేశవ్యాప్తంగా 5 పురావస్తు కేంద్రాల ఆధునికీకరణ, అభివృద్ధి చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ను ఆమె ప్రవేశపెడుతున్నారు. హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్, అసోంలోని శివసాగర్, గుజరాత్ లోని డోలావీర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
 
వాయు కాలుష్యం తగ్గించేందుకు రూ.4,400 కోట్లు
వాయు కాలుష్యం తగ్గించేందుకు రూ.4,400 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో నిర్మల సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలను హెచ్చరించారు. మితిమీరి కాలుష్యం వెదజల్లితే మూసివేస్తామన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గిస్తే అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు.
 
ఎల్‌ఐసిలో వాటాల విక్రయం
ఎల్‌ఐసిలో వాటాలను విక్రయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో ఎల్‌ఐసిని లిస్ట్‌ చేసే అవకాశముందని ఆమె అన్నారు.