సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (15:44 IST)

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు

election commission of india
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఐదు చొప్పున ఎమ్మెల్యే కోటా కింద పది శాసనమండలి సభ్యుల (ఎమ్మెల్యే) స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసింది. ఈ సీట్లు మార్చి చివరి నాటికి ఖాళీ అవుతాయి.
 
ఆంధ్రప్రదేశ్‌లో, యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, డి. రామారావు, పి. అశోక్ బాబు, తిరుమల నాయుడు అనే ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. అదేవిధంగా, తెలంగాణలో, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మీర్జా రియాజ్ ఉల్ హసన్, షెరి సుభాష్ రెడ్డి, ఇ. మల్లేశం పదవీకాలం కూడా మార్చి చివరి నాటికి ముగుస్తుంది.
 
షెడ్యూల్ ప్రకారం, ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ మార్చి-3న జారీ చేయబడుతుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 10న ప్రారంభమవుతుంది, ఆ తర్వాత మార్చి 11న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 13. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి.

పోలింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.