ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 31 మార్చి 2017 (12:33 IST)

అతడి పుట్టినరోజుకి ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకున్నారు... ఐదుగురు శవాలై తేలారు....

కొన్ని పార్టీలు సంతోషానికి బదులు దుఃఖాన్ని మిగులుస్తుంటాయి. అనుకోని విధంగా ప్రాణాలను కబళిస్తుంటాయి. తాజాగా దాద్రాలో జరిగిన ఓ ఘటన ఐదుగురి ప్రాణాలను తీసింది. వివరాల్లోకి వెళితే... తమ స్నేహితుడిని ఆశ్చర్యంలో ముంచెత్తే రీతిలో బర్త్ డే పార్టీ ఇవ్వాలని సుమ

కొన్ని పార్టీలు సంతోషానికి బదులు దుఃఖాన్ని మిగులుస్తుంటాయి. అనుకోని విధంగా ప్రాణాలను కబళిస్తుంటాయి. తాజాగా దాద్రాలో జరిగిన ఓ ఘటన ఐదుగురి ప్రాణాలను తీసింది. వివరాల్లోకి వెళితే... తమ స్నేహితుడిని ఆశ్చర్యంలో ముంచెత్తే రీతిలో బర్త్ డే పార్టీ ఇవ్వాలని సుమారు 70 మంది అనుకున్నారు. వీరిలో రిసార్ట్స్ యజమానులు కూడా వున్నారు. అనుకున్నదే తడవుగా అతడికి చెప్పకుండా దాద్రా అండ్ నగర్ హవేలీ ప్రాంతంలో వున్న అతడి ఇంటికి వెళ్లారు. 
 
అంతా ఒక్కసారిగా హేపీ బర్త్ డే టూ యూ అని నినాదాలు చేస్తూ హంగామా చేశారు. అతడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆ తర్వాత అతడి ఇంటికి సమీపంలో వున్న ఓ చెరువులో వున్న పడవలో వ్యాహాళికి వెళ్లాలనుకుని అందులో ఎక్కారు. ఆ పడవలో 60 మంది కూర్చునేవిధంగా సీటింగ్ వుంది. కానీ 40 మంది ఎక్కేసరికే అది అటుఇటూ ఊగడం ప్రారంభించింది. దాంతో పడవలో ప్రయాణించేందుకు కొందరు నిరాకరిస్తూ అందులో నుంచి దిగారు. మిగిలివాళ్లు మాత్రం పడవ ప్రయాణం మొదలుపెట్టారు. 
 
అలా నలభై మీటర్ల మేర ప్రయాణించిన కొద్దిసేపటికే పడవ బోల్తా కొట్టింది. దీంతో అంతా నీళ్లలో మునిగిపోయారు. రంగంలోకి దిగిన ఈతగాళ్లు పలువురిని ప్రాణాలతో రక్షించారు. కానీ ఐదుగురు మాత్రం నీటిలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.