బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (14:21 IST)

అన‌ఫిలాక్సిస్‌తో మరణించిన వ్యక్తి.. వ్యాక్సిన్ తొలి మరణ ఇదే

దేశంలో తొలి వ్యాక్సిన్ మృతి నమోదైంది. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ కరోనా టీకాలను వేయించుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉచిత టీకాలు వేయించే పనిలో నిమగ్నమైవున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
క‌రోనా వ్యాక్సిన్ దుష్ప్ర‌భావాల‌పై అధ్య‌య‌నం చేస్తున్న ప్ర‌భుత్వ ప్యానెల్.. దేశంలో వ్యాక్సిన్ త‌ర్వాత తొలి మ‌ర‌ణాన్ని ధృవీక‌రించింది. ఓ 68 ఏళ్ల వ్య‌క్తి వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత అనఫిలాక్సిస్‌తో చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించింది. 
 
వ్యాక్సిన్ త‌ర్వాత క‌లిగే తీవ్ర దుష్ప్ర‌భావాల‌కు సంబంధించి నిపుణుల బృందం ఇచ్చిన నివేదికను ఇండియా టుడే బ‌య‌ట‌పెడ్డింది. వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత మ‌ర‌ణించిన 31 మందిలో క‌లిగిన తీవ్ర దుష్ప్ర‌భావాల‌పై ఈ క‌మిటీ అధ్య‌య‌నం చేసింది. అందులో ఒక వ్య‌క్తి మాత్రం అన‌ఫిలాక్సిస్ వ‌ల్ల చ‌నిపోయిన‌ట్లు తేల్చింది.
 
ఆ వ్య‌క్తి మార్చి 8న వ్యాక్సిన్ తీసుకున్నాడ‌ని క‌మిటీ రిపోర్ట్ చెప్పింది. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత క‌లిగే అన‌ఫిలాక్సిస్ వ‌ల్ల చ‌నిపోయిన తొలి వ్యక్తిగా క‌మిటీ తేల్చింది. అన‌ఫిలాక్సిస్ అంటే ఒక తీవ్రమైన‌ ఎల‌ర్జీ. నిజానికి మ‌రో ముగ్గురు కూడా వ్యాక్సిన్ వ‌ల్లే చ‌నిపోయినా.. ప్ర‌భుత్వం మాత్రం ఇదొక్క మ‌ర‌ణాన్నే ధృవీక‌రించింది.