శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (13:17 IST)

ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు, సముద్ర మట్టంతో సమానంగా వరద నీరు

ముంబై వర్షాలు
గత 46 ఏళ్ల తర్వాత ఆగస్టు నెలలో ముంబై మహా నగరంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు ఒకవైపు తుఫాను గాలులు 107 కిలోమీటర్ల వేగంతో ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ప్రారంభమయ్యే దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది.
 
సబర్బన్ రైలు, బస్సు సేవలు, సాధారణ జీవితానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి. అవసరమైన సేవలను మినహాయించి అన్ని కార్యాలయాలు మూసివేయబడ్డాయి. రాబోయే కొద్ది గంటల్లో మరింత భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.