సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (13:16 IST)

జయలలితను దూరంగానైనా చూడటానికి అనుమతించడం లేదు ఎందుకని?: కరుణానిధి

తమిళనాడు సీఎం జయలలిత రెండు వారాలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నానని డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి డిమాండ్ చేశారు

తమిళనాడు సీఎం జయలలిత రెండు వారాలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని తాను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నానని డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి డిమాండ్ చేశారు.

ఇంతవరకు తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, జైట్లీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేరళ సీఎం విజయ్ సహా ఎవ్వరూ జయలలితను చూడలేదని కరుణానిధి ఆరోపించారు.

ఈ నాయకులు అందరూ కేవలం వైద్యులతోనే మాట్లాడారని, జయమ్మ ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకుని వెళ్లారే తప్ప.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తున్న శాఖలను ఆర్థిక శాఖా మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పన్నీర్ సెల్వంకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలపై కరుణానిధి విస్మయం వ్యక్తం చేశారు. అయితే గత 20 రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను దూరంగానైనా చూడటానికి ఏ ఒక్కరిని అనుమితించడం లేదని కరుణానిధి చెప్పారు.
 
అలాంటిది సీఎం జయలలిత సూచన మేరకు పన్నీర్ సెల్వంకు బాధ్యతలు అప్పగించామని ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు విడుదల చేసిన ప్రకటన చదివిన ఏ ఒక్కరికైనా సందేహాలు వస్తాయని కరుణానిధి అన్నారు.