జయమ్మ ఆత్మే అంతా చేసింది.. చిన్నమ్మకు చుక్కలు చూపించింది.. పన్నీరుకు పక్కన నిలిచింది..
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. జయలలిత తర్వాత రాష్ట్రాన్ని శాసిద్దామని భావించిన చిన్నమ్మ శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. జయలలితలా జైలు నుంచే రాష్ట్
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత తమిళనాట రాజకీయాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. జయలలిత తర్వాత రాష్ట్రాన్ని శాసిద్దామని భావించిన చిన్నమ్మ శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. జయలలితలా జైలు నుంచే రాష్ట్రాన్ని కనుసన్నల్లో ఉంచుకుందామని భావించిన శశికళకు జయమ్మే ఆత్మే తగిన బుద్ధి చెప్పిందని తమిళనాట జోరుగా ప్రచారం జరిగింది.
జయలలిత మరణానంతర పరిణామాలన్నింటినీ శశికళ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా.. పన్నీరుకు అమ్మ ఆత్మ మద్దతుగా నిలిచిందని.. అందుకే చిన్నమ్మ జైలులో చిప్పకూడు తింటూ.. దినకరన్‌కు చెక్ పెట్టిందని జోరుగా ప్రచారం సాగింది. అమ్మ నమ్మిన బంటు పన్నీరు సెల్వంతో అమ్మ ఆత్మే అన్నిపనులు చేయించిందని పేర్కొంటున్నారు.
మన్నార్ గుడి మాఫియాను జయలలిత దూరం పెట్టిన సంగతి అందరికీ తెలుసు. కానీ శశికళ మాత్రం అమ్మ మరణానికి అనంతరం అంతా తానై.. పార్టీని శాసించాలనుకుంది. దీంతో అమ్మ ఆత్మకు కోపం వచ్చిందని.. అందుకే ఊహించని విధంగా చివరి క్షణంలో జైలు పాలై, చివరికి పార్టీలో చోటు కూడా కోల్పోయేలా జరిగిందని తమిళ ప్రజలు అనుకుంటున్నారు.
కానీ అలాగే అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులను దక్కించుకునేందుకు పన్నీరు సెల్వంతో పంతానికి పోయి.. దినకరన్ ఎన్నికల కమిషన్ అధికారులకు కోట్లాది రూపాయల లంచం ఇవ్వజూపడంతో దినకరన్ చిక్కుల్లో పడ్డారు. దీంతో శశికళ కుటుంబాన్ని పన్నీరు పక్కనబెట్టి.. ఇరు వర్గాలను కలుపుకుపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు పళనిసామి కూడా దిగిరావాల్సి వచ్చింది. పార్టీ కోసం అంతా ఒక్కటై.. అమ్మ ఆశయాలను నెరవేర్చేందుకు రెడీ అవుతున్నారు. మిళనాట మారిన సమీకరణాలకు అమ్మ ఆత్మనే కారణమని తమిళనాట జోరుగా ప్రచారం చేస్తోంది.