మద్యం మత్తులో పామును కొరికాడు.. అరెస్ట్ అయ్యాడు.. ఎక్కడ?
లాక్ డౌన్ అనంతరం మద్యం షాపులు తెరుచుకున్న వేళ మందుబాబులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మద్యం తాగి ఆ మత్తులో ఓ వ్యక్తి.. మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
కాగా కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది. తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు.
ఆ తరువాత మెడలో వేసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. కుమార్‌ను అరెస్ట్ చేశారు.