ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన పాక్ వాడు... ముంబైలో ఎలర్ట్...
మరోసారి ముంబైను ఓ వార్త ఉలిక్కిపడేలా చేసింది. నేవీ బేస్ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో సంచరించినట్లు సమాచారం రావడంతో నేవీ అధికారులు ఎలెర్ట్ అయ్యారు. హుటాహుటిన నేవీ దళం సమాచారం వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ముంబై సమీపం
మరోసారి ముంబైను ఓ వార్త ఉలిక్కిపడేలా చేసింది. నేవీ బేస్ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో సంచరించినట్లు సమాచారం రావడంతో నేవీ అధికారులు ఎలెర్ట్ అయ్యారు. హుటాహుటిన నేవీ దళం సమాచారం వచ్చిన ప్రాంతాన్ని జల్లెడ పట్టడం మొదలుపెట్టింది. ముంబై సమీపంలోని ఉరాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి నల్ల దుస్తులు ధరించి ఆయుధాలతో సంచరిస్తున్నట్లు స్కూలు విద్యార్థులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఎక్కడంటే అక్కడ చొరబడి విధ్వంసమే లక్ష్యంగా ఆయుధాలతో వస్తున్న నేపధ్యంలో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా అప్రమత్తమైంది. మొత్తం ఐదు నుంచి ఆరుగురు వ్యక్తుల దాకా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.