గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (12:52 IST)

పెద్ద నోట్లుంటే మార్చుకోండి.. సెప్టెంబర్ 30తో గడువు ముగింపు

పెద్ద నోటు మార్చుకునేందుకు ఆర్బీఐ గడువును పెంచే సూచనలు కనిపించట్లేదు. రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ఈ నెలాఖరుతో గడువు ముగిసిపోతోంది. దీంతో ప్రజలు పెద్దనోట్ల వుంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాల్సి వుంటుంది. 
 
మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది. పెద్ద నోటు మార్చుకునేందుకు ఆర్బీఐ గడువును సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా నిర్ణయించింది.  
 
పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసిన 20 రోజుల్లోనే 50 శాతం నోట్లు తిరిగొచ్చాయని చెప్పింది. మార్కెట్లో ఇప్పటికీ ఉన్న మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది.