గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (09:40 IST)

బిడ్డను గుండెలపై కట్టుకుని సరస్సులో దూకిన తల్లి

ఆ మహిళకు అనుమానపు భయం వేధించింది. పరీక్షల్లో తప్పుతానన్న భయంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. తనతో పాటు.. అభంశుభం తెలియని కన్నబిడ్డను కూడా చంపేసింది. మహారాష్ట్రలోని  చంద్రాపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
చంద్రాపూర్‌కు చెందిన రూపాలి గజ్జెవార్ అనే మహిళ గత యేడాది బీకాం ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి ఫెయిలైంది. దీంతో ఈనెల 19వ తేదీన పరీక్షకు మళ్లీ హాజరైంది. ఈసారి కూడా పరీక్ష సరిగా రాయలేదు. దీంతో మళ్లీ పరీక్ష తప్పుతానన్న అనుమానం ఆమెను వెంటాడింది. 
 
దీంతో పరీక్షా కేంద్రం నుంచి నేరుగా ఇంటికివెళ్లి అక్కడ నుంచి తన ఐదేళ్ళ కుమారుడుని తీసుకుని స్థానికంగా ఉండే సరస్సు వద్దకు వెళ్లింది. అక్కడ తన గుండెలపై బిడ్డను కట్టుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.