బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (09:59 IST)

''ఆమె''తో పనిచేసేందుకు నావికాదళ సైనికులు ఇబ్బందిపడ్డారు.. ఇంతకీ ఎవరామె?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో ట్రాన్స్‌జెండర్లకు చోటులేదని నిషేధం విధించిన నేపథ్యంలో.. నౌకాదళానికి సంబంధించి ఓ ట్రాన్స్‌జెండర్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో ట్రాన్స్‌జెండర్లకు చోటులేదని నిషేధం విధించిన నేపథ్యంలో.. నౌకాదళానికి సంబంధించి ఓ ట్రాన్స్‌జెండర్ కేసు వెలుగులోకి వచ్చింది. భారత రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంతోపాటు విస్తృత స్థాయి బాధ్యతలను కూడా అప్పజెప్పాలని ఓవైపు కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ తరహా కేసు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. 
 
నౌకాదళంలో లింగ మార్పిడి చేయించుకున్న ఓ నావికాధికారిని ఉద్యోగం నుంచి తప్పించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ ఐఎన్‌ఎస్‌ ఏకశిల బేస్‌‌లో విధులు నిర్వహిస్తున్నఓ నావికుడు కొన్ని నెలల క్రితం ఆ లింగ మార్పిడి చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో అతను నావికాదళంలో విధులు నిర్వర్తించడం చాలా కష్టం. ఇంకా సహోద్యుగులు కూడా ఆమెగా మారిన అతనితో పనిచేసేందుకు ఇబ్బందిగా ఫీలయ్యారు. అందుకే స్వచ్ఛంధంగా విధుల నుంచి వైదొలగాలని కోరామని.. వెంటనే అతను కూడా సంతోషంగా అంగీకరించినట్లు నావికాదళానికి చెందిన ఓ అధికారి చెప్పారు. 
 
ఇంకా తానొక మగాడి శరరీరంలో చిక్కుకున్న మహిళను అంటూ తరచూ ఆ వ్యక్తి చెప్తుండే వాడని అధికారి తెలిపారు. మరోవైపు ఆపరేషన్‌కు ముందు అతనికి వివాహం కూడా జరిగినట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిబంధనలు నేవీ చట్టంలో లేకపోవటంతో రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది.